Sunday, May 17, 2026

My Secret Colleague- Part -1

Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission. 


Red సిగ్నల్ పడి చాలా సేపైంది…

“ఇంకా ఎంతసేపు ఆగాలి? ఆఫీస్‌కి టైమ్ అయిపోతుంది. అసలే ఇది నా ఫస్ట్ డే…” అని మనసులోనే టెన్షన్ పడుతున్నాడు ప్రేమ్.

వయసు 22 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసి, ఓ చిన్న ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఇటీవలే సెలెక్ట్ అయ్యాడు. ఈరోజు — 05.05.2008 — అతని జాయినింగ్ డేట్.

ఆఫీస్‌లో మొదటి రోజు కావడంతో ముందుగా దేవాలయానికి వెళ్లి పూజ చేసి వస్తున్నాడు. కానీ ఆలయంలో జనసందోహం ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైంది. దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి!

ఎట్టకేలకు కంగారుగా ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కి చేరుకున్నాడు ప్రేమ్.

ఆఫీస్‌లో అందరూ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. మేనేజర్ ఎవరో ఒకరితో ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతున్నాడు. అ సమయానికే అటెండర్ వివేక్ ప్రేమ్‌ను గమనించి దగ్గరకు వచ్చాడు.

“సర్, మీరు ఎవరు? ఏమి కావాలి?” అని అడిగాడు.

“నా పేరు ప్రేమ్. నేను అసిస్టెంట్ మేనేజర్‌గా జాయిన్ అవ్వడానికి వచ్చాను,” అన్నాడు ప్రేమ్.

“ఓహ్… ఆయనే మీరా! వెళ్ళి మేనేజర్‌ని కలవండి సర్,” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వివేక్.

ప్రేమ్ మేనేజర్‌ని కలిసి తనను పరిచయం చేసుకున్నాడు. బయట కనిపించినంత కోపిష్టి మనిషి కాదు మేనేజర్ — చాలా కూల్‌గా మాట్లాడాడు. కొన్ని ఫైల్స్, టాస్క్స్ ఇచ్చి…

“నీ టేబుల్ దగ్గర కూర్చొని పని మొదలు పెట్టు. ఏమైనా డౌట్స్ ఉంటే నీ కాలీగ్, చాలా సీనియర్ అయిన శ్రీలత మేడమ్‌ని అడుగు,” అని చెప్పాడు.

“ఓకే సర్,” అని చెప్పి మేనేజర్ రూమ్‌ నుంచి బయటకు వచ్చి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు ప్రేమ్.

కంప్యూటర్ స్విచ్ ఆన్ చేశాడు. System లోడ్ అవుతున్నంతసేపు ఆఫీస్ అంతా గమనిస్తున్నాడు.

ఆఫీస్‌లో మొత్తం ఇరవై మంది వరకు ఉంటారు. అందులో డెబ్బై శాతం మంది పురుషులు, మిగతావారు మహిళలు. ఎక్కువగా అందరూ నలభై ఏళ్లకు పైబడిన వారే.

“ఇవాళ్లందరిలో నేనే యంగెస్ట్ ఎంప్లాయీ అనుకుంటా…” అని మనసులో అనుకున్నాడు ప్రేమ్.

అంతలో నెమ్మదిగా మల్లెపూల పరిమళం అతని మనసును తాకింది. ఒక్కసారిగా టెన్షన్ అంతా తగ్గిపోయి, మనసు ప్రశాంతంగా అనిపించింది.

పక్కనే ఉన్న టేబుల్‌పై మూర మల్లెపూలు, ఒక చిన్న హ్యాండ్‌బ్యాగ్, సాయిబాబా ఫోటో కనిపించాయి. టేబుల్ మొత్తం ఎంతో శుభ్రంగా, చక్కగా సర్దుకొని ఉంది.

“ఎవరిదో?” అని ఆలోచిస్తూ ఉండగానే కంప్యూటర్ డెస్క్‌టాప్ ఓపెన్ అయింది. గూగుల్ ఓపెన్ చేసి కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తన ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు ప్రేమ్.

అందులో ఒక చిన్న డౌట్ వచ్చింది.

“ఎవరైనా క్లారిఫై చేస్తారేమో…” అనుకుంటూ పక్క టేబుల్ వైపు చూసాడు.

అక్కడ ఒక ఆంటీ పని చేసుకుంటూ కనిపించారు. వయసు యాభై నుంచి యాభై ఐదు మధ్యలో ఉండొచ్చు.

ప్రేమ్ కొద్దిగా నిరాశ చెందాడు.

ఎందుకంటే ఆ మల్లెపూల వాసనకు… తాను ఇరవై ఏళ్లలో ఉన్న ఓ అందమైన అమ్మాయి అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నది ఓ ఆంటీ.


“గుడ్ మార్నింగ్ మామ్… మీ పేరు?” అని అడిగాడు ప్రేమ్.

“గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీలత,” అని సమాధానం ఇచ్చింది ఆమె.

“ఓహ్… అంటే మేనేజర్ గారు నాకు డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగమన్నారు.”

“హ్మ్… సరే. ఏంటి నీ డౌట్?”

“ఏం లేదు మామ్… నా ప్రొఫైల్‌లో సర్‌నేమ్ తప్పుగా ఎంటర్ అయింది. దాన్ని ఎలా మార్చాలి?”

“చాలా సింపుల్. నువ్వు టెన్షన్ పడకు…” అంటూ కొన్ని క్లిక్స్ చేసి,
“ఇప్పుడే సరి అయిపోయింది,” అంది.

“సూపర్ మామ్! మీరు ఇక్కడ ఎంతకాలంగా పని చేస్తున్నారు?”

“దాదాపు పదిహేను సంవత్సరాలు. అటెండర్‌గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్. మీరు కొత్త జాయినీనా?”

“అవును మామ్. ఈరోజే జాయినింగ్. అసిస్టెంట్ మేనేజర్‌గా.”

“గ్రేట్! డైరెక్ట్‌గా అసిస్టెంట్ మేనేజర్ అంటే నువ్వు చాలా లక్కీ.”

“అంతేం లేదు మామ్… సారీ మామ్, ఒక ఫోన్ వస్తోంది. మీతో తర్వాత మాట్లాడతాను.”

“ఓకే.”


సాయంత్రం అయిపోయింది.

మొదటి రోజు కొత్తగా… టెన్షన్‌గా… కంగారుగా గడిచిపోయింది.

రాత్రి ఏడు గంటలు అయ్యాక ఆఫీస్ బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రేమ్. అంతలో అటెండర్ వివేక్ అక్కడికి వచ్చాడు.

“నమస్తే సర్! ఎలా ఉంది ఆఫీస్? జాబ్?” అని అడిగాడు.

“పర్లేదు… బాగానే ఉంది. అందరూ మంచి వాళ్లలా అనిపించారు,” అన్నాడు ప్రేమ్.

“అవును సర్… అందరూ మంచి ఎంప్లాయీస్. ఒక్కరు తప్ప…”

“ఎవరు?”

“ఇంకెవరు… శ్రీలత మేడమ్.”

“అవునా? ఆవిడ కూడా బాగానే ఉన్నారు కదా! నేను ఉదయం మాట్లాడాను.”

“మీరు ఈరోజే వచ్చారు కాబట్టి మీకు ఇంకా తెలియదు సర్. ఆ మేడమ్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆవిడకే తెలియదు. Actually ఆవిడ మంచిదే… కానీ ఐదేళ్ల క్రితం ఆమెకు భర్తతో డైవోర్స్ అయింది. అప్పటి నుంచి ఆమె బిహేవియర్‌లో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి… కొంచెం జాగ్రత్తగా ఉండండి.”

“ఓకే… బై.”

“ఓకే సర్, బై.”


మరుసటి రోజు ఉదయం…

ఆఫీస్‌లోకి అడుగుపెట్టగానే వివేక్ వచ్చి,

“సర్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. కేబిన్‌కి వెళ్లండి,” అన్నాడు.

“ఓకే, ష్యూర్,” అన్నాడు ప్రేమ్.

ప్రేమ్ మేనేజర్ కేబిన్‌లోకి వెళ్లాడు. అక్కడ మేనేజర్‌తో పాటు శ్రీలత మేడమ్ కూడా ఉన్నారు.

మేనేజర్ ప్రేమ్ వైపు చూసి,

“ప్లీజ్, టేక్ యువర్ సీట్ ప్రేమ్,” అన్నాడు.

“ష్యూర్ సర్. థ్యాంక్యూ,” అని కూర్చున్నాడు ప్రేమ్.

మేనేజర్ కాసేపు ఫైల్ చూస్తూ…

“చూడండి… మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఆఫీస్‌కి వంద కిలోమీటర్ల దూరంలో ఇటీవల మేమొక చిన్న కాల్ సెంటర్ ప్రారంభించాం. కానీ అక్కడ ఇంకా ఉద్యోగులను రిక్రూట్ చేయలేదు. కాబట్టి అది సరిగా రన్ అవ్వాలంటే ఇక్కడి నుంచి కొందరు వెళ్లి పని చేయాలి.”

అని చెప్పి కాసేపు ఆగాడు.

“అందుకే… నేను మీ ఇద్దరినీ సెలెక్ట్ చేశాను. మీకు ఓకేనా?”

“నాకు ఓకే సర్,” అన్నాడు ప్రేమ్.

“నాకూ ఓకే సర్,” అంది శ్రీలత.

“వెరీ గుడ్. రేపటి నుంచి మీరు అక్కడి నుంచి పని ప్రారంభించవచ్చు. ఆల్ ది బెస్ట్.”

“సర్… అక్కడ ఎంతకాలం పని చేయాలి?” అని అడిగాడు ప్రేమ్.

“జస్ట్ ఒక నెల. అలాగే అక్కడ మన గెస్ట్ హౌస్‌లో ఉండొచ్చు.”

“ష్యూర్ సర్. థ్యాంక్యూ.”


కేబిన్ బయటకు వచ్చిన ప్రేమ్ మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన…

“ఒక నెలపాటు… నేను ఆవిడతో కలిసి ఎలా పని చేయాలి?”

అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు…

కొనసాగుతుంది పార్ట్ - 2…


Keep Loving & Keep Reading......

Thanks for reading the story.

Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

Saturday, May 9, 2026

🎬 సెకండ్ షో - Telugu Horror Story – Chapter -2


Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission. 


కిషోర్ : అంటే... నువ్వు ఏం చెప్తున్నావ్ రా...?

రవి : ఈ ఇంట్లో మనం కాకుండా వేరే ఎవరో ఉన్నారు................


కిషోర్ : ఇప్పుడు ఏం చేద్దాం...? చాలా భయంగా ఉంది రా. మనం ఇలా వచ్చి ఇరుక్కుపోతామని అసలు అనుకోలేదు.

రవి : కంగారు పడకు. నాకు కూడా భయంగానే ఉంది. కానీ మనం భయాన్ని వదిలి ఆలోచిస్తేనే ఇక్కడి నుంచి బయటపడగలం. అర్థమైందా...?

కిషోర్ : హ్మ్... కానీ ఎలా??

రవి : సౌండ్ చేయకు. సైలెంట్‌గా మనం ఈ ఇంట్లో ఎక్కడైనా ఎగ్జిట్ ఉందేమో వెతుకుదాం.

కిషోర్ : ఓకే... సరే రా.

రవి : పద.


కిషోర్ : పోనీ... మన ఫ్యాక్టరీ colleagues ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామా...?

రవి : ఈ టైమ్‌లో వచ్చి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు రా...? అలానే ఫోన్‌లో సిగ్నల్ కూడా లేదు.


అలా రవి, కిషోర్ ఇద్దరూ చీకట్లో మెల్లగా ఎగ్జిట్ కోసం సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వేసుకుని వెతుకుతున్నారు. మరోపక్క ఆ ఏడుపు శబ్దం మాత్రం ఆగకుండా వినిపిస్తూనే ఉంది.

అంతలో వాళ్లకి ఒక చిన్న రూమ్ కనిపించింది...


రవి : రేయ్... ఇక్కడ ఒక రూమ్ ఉంది చూశావా...?

కిషోర్ : ఒకవేళ అందులో ఏదైనా ఎగ్జిట్ ఉండొచ్చు. చూద్దాం పద.


ఇద్దరూ ఆ రూమ్‌లోకి వెళ్లారు.

రవి : రేయ్... ఇక్కడ ఎగ్జిట్ లేదు. కానీ ఒక చిన్న విండో ఉంది. బ్రేక్ చేద్దామా...?

కిషోర్ : హా... ఇక్కడ ఒక రాడ్ ఉంది, ఆగు.


ఇద్దరూ చాలాసేపు ప్రయత్నించారు. కానీ అది పనిచేయలేదు.

రవి : రేయ్... ఇది మనం బ్రేక్ చేయలేం. కానీ ఇక్కడి నుంచి మనం ఎవరికైనా హెల్ప్ అడగొచ్చు.

కిషోర్ : కరెక్టే... కానీ ఈ టైమ్‌లో ఎవరు ఉండరు కదా...?

రవి : అవును. .. ఒక పని చెయ్. ఆ డోర్ క్లోజ్ చెయ్. ఈ నైట్ అంతా మనం ఈ చిన్న రూమ్‌లోనే ఉండిపోదాం. ఎర్లీ మార్నింగ్ ఎవరో ఒకరు ఈ దారిలో రావచ్చు. అప్పుడు వాళ్లని ఈ విండో ద్వారా హెల్ప్ అడుగుదాం.

కిషోర్ : ఓకే.


డోర్ లాక్ చేసుకుని, ఆ చిన్న రూమ్‌లో వాళ్లు ఇద్దరూ భయంతో కూర్చున్నారు. బయట గాలి శబ్దం, దూరంగా వినిపిస్తున్న ఏడుపు... ఆ రాత్రిని ఇంకా భయంకరంగా మార్చేశాయి.


Early Morning :

రవి : రేయ్... లేవరా! టైమ్ 6 అయింది.

కిషోర్ : అసలు నిద్ర పడితే కదరా లేవడానికి...! నైట్ అంతా భయంతో కంటిమీద కునుకు లేదు రా బాబు.

రవి : ఇక్కడి నుంచి బయటపడటానికి ఇదే కరెక్ట్ టైమ్. చుట్టూ పొలాలు ఉన్నాయి. ఎవరో ఒకరు పొలం పనికి వస్తారు. వాళ్లని హెల్ప్ అడుగుదాం.

కిషోర్ : ఓకే రా... డన్.


రవి, కిషోర్ ఇద్దరూ విండో దగ్గరకు వెళ్లి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నారు.

అంతలో ఒక పెద్దాయన సైకిల్ తొక్కుకుంటూ ఆ ఇంటి వైపు వస్తున్నాడు.

అది చూసిన రవి ఒక్కసారిగా గట్టిగా —

“హెల్ప్..! హెల్ప్ సర్..! ఇక్కడ చూడండి..!”

అని అరవడం మొదలుపెట్టాడు. కిషోర్ కూడా భయంతో గట్టిగా అరవసాగాడు.

ఆ అరుపులు విన్న ఆ పెద్దాయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

"వీళ్ళు ఎవరు...? అసలు లోపలికి ఎలా వెళ్లారు...?" అని ఆశ్చర్యపోతూ ఆ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్లని బయటకి తీసుకొచ్చాడు.


ఆ పెద్దాయన ఆశ్చర్యంగా అడిగాడు :

“మీరు ఎవరు...? అసలు మీకు ఈ house గురించి ఏమైనా తెలుసా...? లోపలికి ఎందుకు వెళ్లారు...?”


రవి : తెలియదు సర్... మా టైమ్ బాలేక మా బైక్‌కి ప్రాబ్లమ్ వచ్చి అలా వెళ్లాం...

అని జరిగినదంతా చెప్పాడు.


అప్పుడు ఆ పెద్దాయన గంభీరంగా అన్నాడు :

“ఏమైనా... మీరు చేసింది చాలా ప్రమాదకరమైన సాహసం. అసలు ఆ house లో ఏముందో... అది ఎంత dangerో మీకు తెలియదు. మీరు ఇక నుంచి చాలా careful‌గా ఉండండి. ఎందుకంటే అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎవరూ ప్రశాంతంగా లేరు...”


రవి : ఏమిటి మీరు మాట్లాడేది...? మాకు ఏం అర్థం కావట్లేదు.


ఆ పెద్దాయన నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు :

“ఆ house లో ఒక ప్రేతాత్మ ఉంది... చాలా ఏళ్లుగా. అందుకే అందులోకి ఎవరూ వెళ్లరు. ఒకవేళ వెళ్లినా... వాళ్లు అంత easyగా బయటకు రారు. ఒకవేళ వచ్చినా... వాళ్లని ఆ ఆత్మ వెంటాడి వేధిస్తుంది...”


ఆ మాటలు విన్న రవి, కిషోర్‌లకు ఒక్కసారిగా మాటలు రావడం మానేశాయి...

వాళ్ల గుండెల్లో భయం మరింత పెరిగింది...


Hunt Begins.... 👁️‍🗨️

To Be Continued in Chapter - 3


Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

My Secret Colleague- Part -1

Note: This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any...