Note:
This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission.
రాత్రి 12:45 AM అయ్యింది. బైక్ వెనుక సీట్లో కూర్చున్న రవి, “కొంచెం స్పీడ్‌గా వెళ్లు” అని అన్నాడు. రవి, కిషోర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే ఊరికి చెందిన వాళ్లు. ఇద్దరూ ఉద్యోగం కోసం రెండు వారాల క్రితం టౌన్‌కి వచ్చి, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో పని సంపాదించారు. చిన్న రూమ్ ఒకటి అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. ప్రతి వారం ఒకసారి సినిమా చూడటం వాళ్ల అలవాటు. అందుకే ఈ ఆదివారం కూడా సినిమా చూసి, రాత్రి లేట్‌గా రూమ్‌కి తిరిగి వెళ్తున్నారు.
బైక్ మీద వెళ్తూ రవి అడిగాడు:
“ఎవరైనా సెకండ్ షో కోసం ఇంత దూరం ట్రావెల్ చేస్తారా?”
దానికి కిషోర్ నవ్వుతూ,
“ఏం అవుతుంది? ఇంకో ఇరవై నిమిషాల్లో మనం రూమ్‌కి చేరిపోతాం. డోంట్ వర్రీ,” అని చెప్పాడు.
కొన్ని నిమిషాల తర్వాత రవి ఒక్కసారిగా ముందుకు చూపిస్తూ,
“రా చూడు, రోడ్ బ్లాక్ అయింది,” అన్నాడు.
కిషోర్ ఆశ్చర్యపడి,
“అదేంటి? మనం ఇదే రోడ్డులోనే కదా సినిమా కి వచ్చాం. అప్పుడైతే బాగానే ఉంది!” అన్నాడు.
రవి కాసేపు గమనించి,
“అప్పుడూ ఇలానే ఉండి ఉండొచ్చు, కానీ పక్కన చిన్న దారి ఉండేది. ఇప్పుడు అది కూడా మూసేశారు,” అన్నాడు.
“షిట్! ఇప్పుడు ఎలా?” అని కిషోర్ ఆందోళనగా అడిగాడు.
“వెనక్కి వెళ్లి, ఎవరైనా ఉంటే అడిగి వేరే రూట్‌లో వెళ్దాం,” అన్నాడు రవి.
అంతలో రవి పక్కన ఉన్న చిన్న దారిని చూపిస్తూ,
“ఇది ఏదో షార్ట్‌కట్‌లా ఉంది. పోనీ చూసేద్దాం,” అన్నాడు.
“నీకు రూట్ తెలుసా?” అని కిషోర్ సందేహంగా అడిగాడు.
“బ్యాక్ వెళ్లడం కంటే ఇదే బెటర్. పోనీ చూద్దాం,” అన్నాడు రవి.
అలా కొంత దూరం వెళ్లాక ఒక Y-జంక్షన్ వచ్చింది. రెండు దారులు కనిపించాయి.
“ఇప్పుడు ఏ దారిలో వెళ్దాం?” అని కిషోర్ అడిగాడు.
రవి అయోమయంలో,
“ఇలా రెండు దారులు వస్తాయని నేను ఊహించలేదు,” అన్నాడు.
అప్పటికే సమయం 1:30 AM అయింది. చాలా సేపు సరైన దారి కోసం ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా వస్తే అడగాలని అనుకున్నారు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. చివరకు ఎడమ దారి తీసుకుని ముందుకు వెళ్లారు.
కొంత దూరం వెళ్లగానే బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ చేయడానికి రవి ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది. చుట్టూ రెండు వైపులా చెట్లు, పొదలు… గాఢమైన చీకటి.
కిషోర్ నిరాశగా,
“ఇంజిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. స్టార్ట్ కావడం లేదు,” అన్నాడు.
“ఇప్పుడు ఏం చేద్దాం?” అని రవి అడిగాడు.
“ఈ రాత్రి ఇక్కడే ఉండాల్సిందే,” అని కిషోర్ చెప్పాడు.
రవి ఫోన్ టార్చ్ వేసుకుని కొంచెం దూరం నడవడం ప్రారంభించాడు.
“ఎక్కడికి వెళ్తున్నావ్?” అని కిషోర్ అడిగాడు.
“టాయిలెట్ కి రా!” అని రవి చెప్పాడు.
అప్పుడే రవికి దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇంటి చుట్టూ పొలం, మధ్యలో ఒంటరిగా ఆ ఇల్లు ఉంది.
“రా! అక్కడ ఒక ఇల్లు ఉంది,” అని రవి ఉత్సాహంగా చెప్పాడు.
“ఇక్కడ ఇల్లు? ఆశ్చర్యంగా ఉంది,” అన్నాడు కిషోర్.
“టైమ్ దాదాపు 2 AM అవుతుంది. బైక్ కూడా పనిచేయడం లేదు. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తాం? ఈ రాత్రి అక్కడే ఉండి, ఉదయం ఎవరైనా ఉంటే రూట్ అడిగి వెళ్దాం,” అన్నాడు రవి.
కిషోర్ కొంచెం ఆలోచించి,
“ఐడియా బాగుంది, కానీ ఆ ఇల్లు ఎవరిదో, ఓపెన్‌లో ఉందో క్లోజ్‌లో ఉందో తెలియదు,” అన్నాడు.
“ముందు వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. లెట్స్ ట్రై,” అన్నాడు రవి.
ఇద్దరూ ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. చుట్టూ గాఢమైన చీకటి, చల్లని గాలి, పంట పొలాలు. డోర్ దగ్గరకు వెళ్లి నాక్ చేశారు.
“డోర్ బయట నుంచి మూసేశారు,” అన్నాడు కిషోర్.
“బహుశా లోపల ఏదైనా ధాన్యం పెట్టి వెళ్లి ఉంటారు. ఓపెన్ చేద్దాం,” అన్నాడు రవి.
డోర్ తెరిచిన వెంటనే పెద్ద శబ్దంతో లోపల ఉన్న గబ్బిలాలు బయటికి ఎగిరాయి.
“ఈ ఇల్లు చాలా కాలంగా మూసి ఉన్నట్టుంది. లోపల మొత్తం దుమ్ము, గబ్బిలాలు,” అన్నాడు రవి.
“పర్లేదు, మనం కొద్దిసేపు మాత్రమే ఇక్కడ ఉంటాం,” అన్నాడు కిషోర్.
ఇద్దరూ ఇంట్లో ఒక మూలలో పడుకున్నారు.
కొంత సమయం తర్వాత…
ఒకేసారి పెద్దగా ఏడుపు శబ్దం వినిపించింది.
రవి ఒక్కసారిగా లేచి,
“నువ్వు విన్నావా?” అని అడిగాడు.
కిషోర్ అలసటగా,
“నిద్రను డిస్టర్బ్ చేయకు,” అన్నాడు.
మళ్లీ అదే ఏడుపు శబ్దం వినిపించింది.
“ఇప్పుడైనా విన్నావా?” అని రవి భయంతో అడిగాడు.
“అవును… ఎవరు అది?” అని కిషోర్ కూడా కంగారు పడ్డాడు.
“చాలా భయంగా ఉంది,” అన్నాడు రవి.
“ముందు డోర్ మూసేయ్. సౌండ్ బయట నుంచి వస్తోంది,” అన్నాడు కిషోర్.
రవి వెళ్లి డోర్ మూసేశాడు.
కొన్ని క్షణాల తర్వాత… మళ్లీ అదే ఏడుపు శబ్దం వినిపించింది.
ఈసారి రవి గట్టిగా,
“ఈసారి సౌండ్ బయట నుంచి కాదు!” అన్నాడు.
“మరి ఎక్కడి నుంచి?” అని కిషోర్ అడిగాడు.
రవి వణుకుతూ,
“ఈ ఇంట్లో నుండే…” అన్నాడు.
కిషోర్ షాక్ అయి,
“అంటే నువ్వు ఏమంటున్నావ్?” అని అడిగాడు.
రవి నెమ్మదిగా చెప్పాడు—
“ఈ ఇంట్లో మనం కాకుండా… ఇంకెవరో ఉన్నారు…” 😨
No comments:
Post a Comment