Sunday, May 17, 2026

My Secret Colleague- Part -1

Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission. 


Red సిగ్నల్ పడి చాలా సేపైంది…

“ఇంకా ఎంతసేపు ఆగాలి? ఆఫీస్‌కి టైమ్ అయిపోతుంది. అసలే ఇది నా ఫస్ట్ డే…” అని మనసులోనే టెన్షన్ పడుతున్నాడు ప్రేమ్.

వయసు 22 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసి, ఓ చిన్న ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఇటీవలే సెలెక్ట్ అయ్యాడు. ఈరోజు — 05.05.2008 — అతని జాయినింగ్ డేట్.

ఆఫీస్‌లో మొదటి రోజు కావడంతో ముందుగా దేవాలయానికి వెళ్లి పూజ చేసి వస్తున్నాడు. కానీ ఆలయంలో జనసందోహం ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైంది. దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి!

ఎట్టకేలకు కంగారుగా ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కి చేరుకున్నాడు ప్రేమ్.

ఆఫీస్‌లో అందరూ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. మేనేజర్ ఎవరో ఒకరితో ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతున్నాడు. అ సమయానికే అటెండర్ వివేక్ ప్రేమ్‌ను గమనించి దగ్గరకు వచ్చాడు.

“సర్, మీరు ఎవరు? ఏమి కావాలి?” అని అడిగాడు.

“నా పేరు ప్రేమ్. నేను అసిస్టెంట్ మేనేజర్‌గా జాయిన్ అవ్వడానికి వచ్చాను,” అన్నాడు ప్రేమ్.

“ఓహ్… ఆయనే మీరా! వెళ్ళి మేనేజర్‌ని కలవండి సర్,” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వివేక్.

ప్రేమ్ మేనేజర్‌ని కలిసి తనను పరిచయం చేసుకున్నాడు. బయట కనిపించినంత కోపిష్టి మనిషి కాదు మేనేజర్ — చాలా కూల్‌గా మాట్లాడాడు. కొన్ని ఫైల్స్, టాస్క్స్ ఇచ్చి…

“నీ టేబుల్ దగ్గర కూర్చొని పని మొదలు పెట్టు. ఏమైనా డౌట్స్ ఉంటే నీ కాలీగ్, చాలా సీనియర్ అయిన శ్రీలత మేడమ్‌ని అడుగు,” అని చెప్పాడు.

“ఓకే సర్,” అని చెప్పి మేనేజర్ రూమ్‌ నుంచి బయటకు వచ్చి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు ప్రేమ్.

కంప్యూటర్ స్విచ్ ఆన్ చేశాడు. System లోడ్ అవుతున్నంతసేపు ఆఫీస్ అంతా గమనిస్తున్నాడు.

ఆఫీస్‌లో మొత్తం ఇరవై మంది వరకు ఉంటారు. అందులో డెబ్బై శాతం మంది పురుషులు, మిగతావారు మహిళలు. ఎక్కువగా అందరూ నలభై ఏళ్లకు పైబడిన వారే.

“ఇవాళ్లందరిలో నేనే యంగెస్ట్ ఎంప్లాయీ అనుకుంటా…” అని మనసులో అనుకున్నాడు ప్రేమ్.

అంతలో నెమ్మదిగా మల్లెపూల పరిమళం అతని మనసును తాకింది. ఒక్కసారిగా టెన్షన్ అంతా తగ్గిపోయి, మనసు ప్రశాంతంగా అనిపించింది.

పక్కనే ఉన్న టేబుల్‌పై మూర మల్లెపూలు, ఒక చిన్న హ్యాండ్‌బ్యాగ్, సాయిబాబా ఫోటో కనిపించాయి. టేబుల్ మొత్తం ఎంతో శుభ్రంగా, చక్కగా సర్దుకొని ఉంది.

“ఎవరిదో?” అని ఆలోచిస్తూ ఉండగానే కంప్యూటర్ డెస్క్‌టాప్ ఓపెన్ అయింది. గూగుల్ ఓపెన్ చేసి కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తన ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు ప్రేమ్.

అందులో ఒక చిన్న డౌట్ వచ్చింది.

“ఎవరైనా క్లారిఫై చేస్తారేమో…” అనుకుంటూ పక్క టేబుల్ వైపు చూసాడు.

అక్కడ ఒక ఆంటీ పని చేసుకుంటూ కనిపించారు. వయసు యాభై నుంచి యాభై ఐదు మధ్యలో ఉండొచ్చు.

ప్రేమ్ కొద్దిగా నిరాశ చెందాడు.

ఎందుకంటే ఆ మల్లెపూల వాసనకు… తాను ఇరవై ఏళ్లలో ఉన్న ఓ అందమైన అమ్మాయి అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నది ఓ ఆంటీ.


“గుడ్ మార్నింగ్ మామ్… మీ పేరు?” అని అడిగాడు ప్రేమ్.

“గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీలత,” అని సమాధానం ఇచ్చింది ఆమె.

“ఓహ్… అంటే మేనేజర్ గారు నాకు డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగమన్నారు.”

“హ్మ్… సరే. ఏంటి నీ డౌట్?”

“ఏం లేదు మామ్… నా ప్రొఫైల్‌లో సర్‌నేమ్ తప్పుగా ఎంటర్ అయింది. దాన్ని ఎలా మార్చాలి?”

“చాలా సింపుల్. నువ్వు టెన్షన్ పడకు…” అంటూ కొన్ని క్లిక్స్ చేసి,
“ఇప్పుడే సరి అయిపోయింది,” అంది.

“సూపర్ మామ్! మీరు ఇక్కడ ఎంతకాలంగా పని చేస్తున్నారు?”

“దాదాపు పదిహేను సంవత్సరాలు. అటెండర్‌గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్. మీరు కొత్త జాయినీనా?”

“అవును మామ్. ఈరోజే జాయినింగ్. అసిస్టెంట్ మేనేజర్‌గా.”

“గ్రేట్! డైరెక్ట్‌గా అసిస్టెంట్ మేనేజర్ అంటే నువ్వు చాలా లక్కీ.”

“అంతేం లేదు మామ్… సారీ మామ్, ఒక ఫోన్ వస్తోంది. మీతో తర్వాత మాట్లాడతాను.”

“ఓకే.”


సాయంత్రం అయిపోయింది.

మొదటి రోజు కొత్తగా… టెన్షన్‌గా… కంగారుగా గడిచిపోయింది.

రాత్రి ఏడు గంటలు అయ్యాక ఆఫీస్ బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రేమ్. అంతలో అటెండర్ వివేక్ అక్కడికి వచ్చాడు.

“నమస్తే సర్! ఎలా ఉంది ఆఫీస్? జాబ్?” అని అడిగాడు.

“పర్లేదు… బాగానే ఉంది. అందరూ మంచి వాళ్లలా అనిపించారు,” అన్నాడు ప్రేమ్.

“అవును సర్… అందరూ మంచి ఎంప్లాయీస్. ఒక్కరు తప్ప…”

“ఎవరు?”

“ఇంకెవరు… శ్రీలత మేడమ్.”

“అవునా? ఆవిడ కూడా బాగానే ఉన్నారు కదా! నేను ఉదయం మాట్లాడాను.”

“మీరు ఈరోజే వచ్చారు కాబట్టి మీకు ఇంకా తెలియదు సర్. ఆ మేడమ్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆవిడకే తెలియదు. Actually ఆవిడ మంచిదే… కానీ ఐదేళ్ల క్రితం ఆమెకు భర్తతో డైవోర్స్ అయింది. అప్పటి నుంచి ఆమె బిహేవియర్‌లో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి… కొంచెం జాగ్రత్తగా ఉండండి.”

“ఓకే… బై.”

“ఓకే సర్, బై.”


మరుసటి రోజు ఉదయం…

ఆఫీస్‌లోకి అడుగుపెట్టగానే వివేక్ వచ్చి,

“సర్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. కేబిన్‌కి వెళ్లండి,” అన్నాడు.

“ఓకే, ష్యూర్,” అన్నాడు ప్రేమ్.

ప్రేమ్ మేనేజర్ కేబిన్‌లోకి వెళ్లాడు. అక్కడ మేనేజర్‌తో పాటు శ్రీలత మేడమ్ కూడా ఉన్నారు.

మేనేజర్ ప్రేమ్ వైపు చూసి,

“ప్లీజ్, టేక్ యువర్ సీట్ ప్రేమ్,” అన్నాడు.

“ష్యూర్ సర్. థ్యాంక్యూ,” అని కూర్చున్నాడు ప్రేమ్.

మేనేజర్ కాసేపు ఫైల్ చూస్తూ…

“చూడండి… మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఆఫీస్‌కి వంద కిలోమీటర్ల దూరంలో ఇటీవల మేమొక చిన్న కాల్ సెంటర్ ప్రారంభించాం. కానీ అక్కడ ఇంకా ఉద్యోగులను రిక్రూట్ చేయలేదు. కాబట్టి అది సరిగా రన్ అవ్వాలంటే ఇక్కడి నుంచి కొందరు వెళ్లి పని చేయాలి.”

అని చెప్పి కాసేపు ఆగాడు.

“అందుకే… నేను మీ ఇద్దరినీ సెలెక్ట్ చేశాను. మీకు ఓకేనా?”

“నాకు ఓకే సర్,” అన్నాడు ప్రేమ్.

“నాకూ ఓకే సర్,” అంది శ్రీలత.

“వెరీ గుడ్. రేపటి నుంచి మీరు అక్కడి నుంచి పని ప్రారంభించవచ్చు. ఆల్ ది బెస్ట్.”

“సర్… అక్కడ ఎంతకాలం పని చేయాలి?” అని అడిగాడు ప్రేమ్.

“జస్ట్ ఒక నెల. అలాగే అక్కడ మన గెస్ట్ హౌస్‌లో ఉండొచ్చు.”

“ష్యూర్ సర్. థ్యాంక్యూ.”


కేబిన్ బయటకు వచ్చిన ప్రేమ్ మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన…

“ఒక నెలపాటు… నేను ఆవిడతో కలిసి ఎలా పని చేయాలి?”

అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు…

కొనసాగుతుంది పార్ట్ - 2…


Keep Loving & Keep Reading......

Thanks for reading the story.

Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

Saturday, May 9, 2026

🎬 సెకండ్ షో - Telugu Horror Story – Chapter -2


Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission. 


కిషోర్ : అంటే... నువ్వు ఏం చెప్తున్నావ్ రా...?

రవి : ఈ ఇంట్లో మనం కాకుండా వేరే ఎవరో ఉన్నారు................


కిషోర్ : ఇప్పుడు ఏం చేద్దాం...? చాలా భయంగా ఉంది రా. మనం ఇలా వచ్చి ఇరుక్కుపోతామని అసలు అనుకోలేదు.

రవి : కంగారు పడకు. నాకు కూడా భయంగానే ఉంది. కానీ మనం భయాన్ని వదిలి ఆలోచిస్తేనే ఇక్కడి నుంచి బయటపడగలం. అర్థమైందా...?

కిషోర్ : హ్మ్... కానీ ఎలా??

రవి : సౌండ్ చేయకు. సైలెంట్‌గా మనం ఈ ఇంట్లో ఎక్కడైనా ఎగ్జిట్ ఉందేమో వెతుకుదాం.

కిషోర్ : ఓకే... సరే రా.

రవి : పద.


కిషోర్ : పోనీ... మన ఫ్యాక్టరీ colleagues ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామా...?

రవి : ఈ టైమ్‌లో వచ్చి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు రా...? అలానే ఫోన్‌లో సిగ్నల్ కూడా లేదు.


అలా రవి, కిషోర్ ఇద్దరూ చీకట్లో మెల్లగా ఎగ్జిట్ కోసం సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వేసుకుని వెతుకుతున్నారు. మరోపక్క ఆ ఏడుపు శబ్దం మాత్రం ఆగకుండా వినిపిస్తూనే ఉంది.

అంతలో వాళ్లకి ఒక చిన్న రూమ్ కనిపించింది...


రవి : రేయ్... ఇక్కడ ఒక రూమ్ ఉంది చూశావా...?

కిషోర్ : ఒకవేళ అందులో ఏదైనా ఎగ్జిట్ ఉండొచ్చు. చూద్దాం పద.


ఇద్దరూ ఆ రూమ్‌లోకి వెళ్లారు.

రవి : రేయ్... ఇక్కడ ఎగ్జిట్ లేదు. కానీ ఒక చిన్న విండో ఉంది. బ్రేక్ చేద్దామా...?

కిషోర్ : హా... ఇక్కడ ఒక రాడ్ ఉంది, ఆగు.


ఇద్దరూ చాలాసేపు ప్రయత్నించారు. కానీ అది పనిచేయలేదు.

రవి : రేయ్... ఇది మనం బ్రేక్ చేయలేం. కానీ ఇక్కడి నుంచి మనం ఎవరికైనా హెల్ప్ అడగొచ్చు.

కిషోర్ : కరెక్టే... కానీ ఈ టైమ్‌లో ఎవరు ఉండరు కదా...?

రవి : అవును. .. ఒక పని చెయ్. ఆ డోర్ క్లోజ్ చెయ్. ఈ నైట్ అంతా మనం ఈ చిన్న రూమ్‌లోనే ఉండిపోదాం. ఎర్లీ మార్నింగ్ ఎవరో ఒకరు ఈ దారిలో రావచ్చు. అప్పుడు వాళ్లని ఈ విండో ద్వారా హెల్ప్ అడుగుదాం.

కిషోర్ : ఓకే.


డోర్ లాక్ చేసుకుని, ఆ చిన్న రూమ్‌లో వాళ్లు ఇద్దరూ భయంతో కూర్చున్నారు. బయట గాలి శబ్దం, దూరంగా వినిపిస్తున్న ఏడుపు... ఆ రాత్రిని ఇంకా భయంకరంగా మార్చేశాయి.


Early Morning :

రవి : రేయ్... లేవరా! టైమ్ 6 అయింది.

కిషోర్ : అసలు నిద్ర పడితే కదరా లేవడానికి...! నైట్ అంతా భయంతో కంటిమీద కునుకు లేదు రా బాబు.

రవి : ఇక్కడి నుంచి బయటపడటానికి ఇదే కరెక్ట్ టైమ్. చుట్టూ పొలాలు ఉన్నాయి. ఎవరో ఒకరు పొలం పనికి వస్తారు. వాళ్లని హెల్ప్ అడుగుదాం.

కిషోర్ : ఓకే రా... డన్.


రవి, కిషోర్ ఇద్దరూ విండో దగ్గరకు వెళ్లి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నారు.

అంతలో ఒక పెద్దాయన సైకిల్ తొక్కుకుంటూ ఆ ఇంటి వైపు వస్తున్నాడు.

అది చూసిన రవి ఒక్కసారిగా గట్టిగా —

“హెల్ప్..! హెల్ప్ సర్..! ఇక్కడ చూడండి..!”

అని అరవడం మొదలుపెట్టాడు. కిషోర్ కూడా భయంతో గట్టిగా అరవసాగాడు.

ఆ అరుపులు విన్న ఆ పెద్దాయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

"వీళ్ళు ఎవరు...? అసలు లోపలికి ఎలా వెళ్లారు...?" అని ఆశ్చర్యపోతూ ఆ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్లని బయటకి తీసుకొచ్చాడు.


ఆ పెద్దాయన ఆశ్చర్యంగా అడిగాడు :

“మీరు ఎవరు...? అసలు మీకు ఈ house గురించి ఏమైనా తెలుసా...? లోపలికి ఎందుకు వెళ్లారు...?”


రవి : తెలియదు సర్... మా టైమ్ బాలేక మా బైక్‌కి ప్రాబ్లమ్ వచ్చి అలా వెళ్లాం...

అని జరిగినదంతా చెప్పాడు.


అప్పుడు ఆ పెద్దాయన గంభీరంగా అన్నాడు :

“ఏమైనా... మీరు చేసింది చాలా ప్రమాదకరమైన సాహసం. అసలు ఆ house లో ఏముందో... అది ఎంత dangerో మీకు తెలియదు. మీరు ఇక నుంచి చాలా careful‌గా ఉండండి. ఎందుకంటే అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎవరూ ప్రశాంతంగా లేరు...”


రవి : ఏమిటి మీరు మాట్లాడేది...? మాకు ఏం అర్థం కావట్లేదు.


ఆ పెద్దాయన నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు :

“ఆ house లో ఒక ప్రేతాత్మ ఉంది... చాలా ఏళ్లుగా. అందుకే అందులోకి ఎవరూ వెళ్లరు. ఒకవేళ వెళ్లినా... వాళ్లు అంత easyగా బయటకు రారు. ఒకవేళ వచ్చినా... వాళ్లని ఆ ఆత్మ వెంటాడి వేధిస్తుంది...”


ఆ మాటలు విన్న రవి, కిషోర్‌లకు ఒక్కసారిగా మాటలు రావడం మానేశాయి...

వాళ్ల గుండెల్లో భయం మరింత పెరిగింది...


Hunt Begins.... 👁️‍🗨️

To Be Continued in Chapter - 3


Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

Saturday, April 25, 2026

🎬 సెకండ్ షో - Telugu Horror Story – Chapter -1

Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission.


రాత్రి 12:45 AM అయ్యింది. బైక్ వెనుక సీట్లో కూర్చున్న రవి, “కొంచెం స్పీడ్‌గా వెళ్లు” అని అన్నాడు. రవి, కిషోర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే ఊరికి చెందిన వాళ్లు. ఇద్దరూ ఉద్యోగం కోసం రెండు వారాల క్రితం టౌన్‌కి వచ్చి, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో పని సంపాదించారు. చిన్న రూమ్ ఒకటి అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. ప్రతి వారం ఒకసారి సినిమా చూడటం వాళ్ల అలవాటు. అందుకే ఈ ఆదివారం కూడా సినిమా చూసి, రాత్రి లేట్‌గా రూమ్‌కి తిరిగి వెళ్తున్నారు.

బైక్ మీద వెళ్తూ రవి అడిగాడు:
“ఎవరైనా సెకండ్ షో కోసం ఇంత దూరం ట్రావెల్ చేస్తారా?”

దానికి కిషోర్ నవ్వుతూ,
“ఏం అవుతుంది? ఇంకో ఇరవై నిమిషాల్లో మనం రూమ్‌కి చేరిపోతాం. డోంట్ వర్రీ,” అని చెప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత రవి ఒక్కసారిగా ముందుకు చూపిస్తూ,
“రా చూడు, రోడ్ బ్లాక్ అయింది,” అన్నాడు.

కిషోర్ ఆశ్చర్యపడి,
“అదేంటి? మనం ఇదే రోడ్డులోనే కదా సినిమా కి వచ్చాం. అప్పుడైతే బాగానే ఉంది!” అన్నాడు.

రవి కాసేపు గమనించి,
“అప్పుడూ ఇలానే ఉండి ఉండొచ్చు, కానీ పక్కన చిన్న దారి ఉండేది. ఇప్పుడు అది కూడా మూసేశారు,” అన్నాడు.

“షిట్! ఇప్పుడు ఎలా?” అని కిషోర్ ఆందోళనగా అడిగాడు.

“వెనక్కి వెళ్లి, ఎవరైనా ఉంటే అడిగి వేరే రూట్‌లో వెళ్దాం,” అన్నాడు రవి.

అంతలో రవి పక్కన ఉన్న చిన్న దారిని చూపిస్తూ,
“ఇది ఏదో షార్ట్‌కట్‌లా ఉంది. పోనీ చూసేద్దాం,” అన్నాడు.

“నీకు రూట్ తెలుసా?” అని కిషోర్ సందేహంగా అడిగాడు.

“బ్యాక్ వెళ్లడం కంటే ఇదే బెటర్. పోనీ చూద్దాం,” అన్నాడు రవి.

అలా కొంత దూరం వెళ్లాక ఒక Y-జంక్షన్ వచ్చింది. రెండు దారులు కనిపించాయి.

“ఇప్పుడు ఏ దారిలో వెళ్దాం?” అని కిషోర్ అడిగాడు.

రవి అయోమయంలో,
“ఇలా రెండు దారులు వస్తాయని నేను ఊహించలేదు,” అన్నాడు.

అప్పటికే సమయం 1:30 AM అయింది. చాలా సేపు సరైన దారి కోసం ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా వస్తే అడగాలని అనుకున్నారు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. చివరకు ఎడమ దారి తీసుకుని ముందుకు వెళ్లారు.

కొంత దూరం వెళ్లగానే బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ చేయడానికి రవి ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది. చుట్టూ రెండు వైపులా చెట్లు, పొదలు… గాఢమైన చీకటి.

కిషోర్ నిరాశగా,
“ఇంజిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. స్టార్ట్ కావడం లేదు,” అన్నాడు.

“ఇప్పుడు ఏం చేద్దాం?” అని రవి అడిగాడు.

“ఈ రాత్రి ఇక్కడే ఉండాల్సిందే,” అని కిషోర్ చెప్పాడు.

రవి ఫోన్ టార్చ్ వేసుకుని కొంచెం దూరం నడవడం ప్రారంభించాడు.

“ఎక్కడికి వెళ్తున్నావ్?” అని కిషోర్ అడిగాడు.

“టాయిలెట్ కి రా!” అని రవి చెప్పాడు.

అప్పుడే రవికి దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇంటి చుట్టూ పొలం, మధ్యలో ఒంటరిగా ఆ ఇల్లు ఉంది.

“రా! అక్కడ ఒక ఇల్లు ఉంది,” అని రవి ఉత్సాహంగా చెప్పాడు.

“ఇక్కడ ఇల్లు? ఆశ్చర్యంగా ఉంది,” అన్నాడు కిషోర్.

“టైమ్ దాదాపు 2 AM అవుతుంది. బైక్ కూడా పనిచేయడం లేదు. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తాం? ఈ రాత్రి అక్కడే ఉండి, ఉదయం ఎవరైనా ఉంటే రూట్ అడిగి వెళ్దాం,” అన్నాడు రవి.

కిషోర్ కొంచెం ఆలోచించి,
“ఐడియా బాగుంది, కానీ ఆ ఇల్లు ఎవరిదో, ఓపెన్‌లో ఉందో క్లోజ్‌లో ఉందో తెలియదు,” అన్నాడు.

“ముందు వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. లెట్స్ ట్రై,” అన్నాడు రవి.

ఇద్దరూ ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. చుట్టూ గాఢమైన చీకటి, చల్లని గాలి, పంట పొలాలు. డోర్ దగ్గరకు వెళ్లి నాక్ చేశారు.

“డోర్ బయట నుంచి మూసేశారు,” అన్నాడు కిషోర్.

“బహుశా లోపల ఏదైనా ధాన్యం పెట్టి వెళ్లి ఉంటారు. ఓపెన్ చేద్దాం,” అన్నాడు రవి.

డోర్ తెరిచిన వెంటనే పెద్ద శబ్దంతో లోపల ఉన్న గబ్బిలాలు బయటికి ఎగిరాయి.

“ఈ ఇల్లు చాలా కాలంగా మూసి ఉన్నట్టుంది. లోపల మొత్తం దుమ్ము, గబ్బిలాలు,” అన్నాడు రవి.

“పర్లేదు, మనం కొద్దిసేపు మాత్రమే ఇక్కడ ఉంటాం,” అన్నాడు కిషోర్.

ఇద్దరూ ఇంట్లో ఒక మూలలో పడుకున్నారు.

కొంత సమయం తర్వాత…
ఒకేసారి పెద్దగా ఏడుపు శబ్దం వినిపించింది.

రవి ఒక్కసారిగా లేచి,
“నువ్వు విన్నావా?” అని అడిగాడు.

కిషోర్ అలసటగా,
“నిద్రను డిస్టర్బ్ చేయకు,” అన్నాడు.

మళ్లీ అదే ఏడుపు శబ్దం వినిపించింది.

“ఇప్పుడైనా విన్నావా?” అని రవి భయంతో అడిగాడు.

“అవును… ఎవరు అది?” అని కిషోర్ కూడా కంగారు పడ్డాడు.

“చాలా భయంగా ఉంది,” అన్నాడు రవి.

“ముందు డోర్ మూసేయ్. సౌండ్ బయట నుంచి వస్తోంది,” అన్నాడు కిషోర్.

రవి వెళ్లి డోర్ మూసేశాడు.

కొన్ని క్షణాల తర్వాత… మళ్లీ అదే ఏడుపు శబ్దం వినిపించింది.

ఈసారి రవి గట్టిగా,
“ఈసారి సౌండ్ బయట నుంచి కాదు!” అన్నాడు.

“మరి ఎక్కడి నుంచి?” అని కిషోర్ అడిగాడు.

రవి వణుకుతూ,
“ఈ ఇంట్లో నుండే…” అన్నాడు.

కిషోర్ షాక్ అయి,
“అంటే నువ్వు ఏమంటున్నావ్?” అని అడిగాడు.

రవి నెమ్మదిగా చెప్పాడు—
“ఈ ఇంట్లో మనం కాకుండా… ఇంకెవరో ఉన్నారు…” 😨


🔜 కొనసాగుతుంది…

Thanks for reading this story.

Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

Sunday, April 19, 2026

నేను నా Sailu - Telugu Love Story

Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission.




మే 23, 2002 — రాత్రి 11:30

రేపు నాకు పరీక్ష ఉంది. ఇది నా సెమిస్టర్‌లో చివరి పరీక్ష మాత్రమే కాదు, నా ఇంజినీరింగ్ కోర్సుకి ఫైనల్ ఎగ్జామ్ కూడా. అంటే రేపటితో నా స్టూడెంట్ లైఫ్‌కు ముగింపు. అందుకే నేను పూర్తిగా ఎక్సైటెడ్‌గా ఉన్నాను—కొంచెం నర్వస్, కొంచెం హ్యాపీ. నిజం చెప్పాలంటే, “రేపు ఎగ్జామ్ ఉంది” అన్న టెన్షన్ కంటే “రేపటితో నేను ఫ్రీ బర్డ్ అవుతాను” అన్న ఆలోచనే ఎక్కువగా ఉంది. నిద్ర కూడా రావట్లేదు. ఈ రాత్రి నాకు స్లీప్ రాదనిపిస్తోంది… ఎందుకంటే మనం చాలా హ్యాపీగా లేదా సాడ్‌గా ఉన్నప్పుడు సాధారణంగా నిద్ర రాదు కదా…


తర్వాతి రోజు

ఎగ్జామ్ అయిపోయింది. పర్లేదు, బానే రాశాను—డెఫినిట్‌గా పాస్ అవుతాను. సో, గేమ్ ఓవర్. బుక్స్‌కి, కాలేజీకి ఒక పెద్ద దణ్ణం పెట్టి, రూమ్‌కి వచ్చి బ్యాగ్, లగేజ్ సర్దుకుని, లంచ్ చేసి స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాను. స్టేషన్ ఎప్పటిలాగే జనాలతో ఫుల్ క్రౌడెడ్‌గా ఉంది. నేను నా బోగీలోకి వెళ్లి నా సీట్‌లో కూర్చున్నాను.

నా పేరు శివ. నేను బెంగుళూరులోని ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాను. ఈరోజుతో అది అయిపోయింది. మాది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. మేము ఒక చిన్న అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న ఫార్మర్—మాకు గ్రామంలో 20 ఎకరాల భూమి ఉంది. అమ్మ హౌస్‌వైఫ్. అక్కకి ఇటీవలే మ్యారేజ్ అయింది, అదే గ్రామంలో ఉంటుంది. అంటే మా ఫ్యామిలీ అంతా మా గ్రామంలోనే ఉంటుంది.
I’m going to my village… కాదు, I’m going back to my family.


తర్వాతి రోజు ఉదయం

మా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక టౌన్‌కి ట్రైన్ వచ్చింది. నేను ట్రైన్ దిగిపోయి ఒక ఆటో తీసుకుని మా గ్రామం వైపు స్టార్ట్ అయ్యాను. చివరికి ఇంటికి చేరుకున్నాను. అమ్మ, నాన్న, అక్క—ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ. ఫుల్‌గా ఫుడ్, ముచ్చట్లు… తెలియకుండానే రెండు రోజులు అయిపోయాయి.

ఒక రోజు నాన్న వచ్చి, “నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏమి చేస్తావు?” అని అడిగారు. నేను, “ఇక్కడే మన ఊరిలో ఉండి, మీకు హెల్ప్ చేస్తూ ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతాను” అన్నాను. నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఒకటే చెప్పారు—“నీకేం చేయాలనిపిస్తే అదే చేయు.”


ఒక రోజు ఉదయం… కాదు, చాలా ఎర్లీ మార్నింగ్—6:00

మా ఇంటి పైకప్పుపై నేను చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. అప్పుడే నేను చూసాను—సైలజ (సైలూ). మా ఇంటికి ఎదురు వైపు వాళ్ల ఇల్లు—చిన్న పెంకు ఇల్లు. వాళ్ల నాన్న కూడా ఫార్మర్ కానీ వాళ్లకు భూమి లేదు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న దగ్గర వర్క్ చేస్తాడు.

తనని చిన్నప్పుడు చాలా సార్లు చూసాను, కానీ రీసెంట్‌గా చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తే… ఎందుకో చాలా అందంగా కనిపించింది. నేను మా కాలేజీలో చాలా మంది గర్ల్స్‌ని చూశాను. చాలామంది నన్ను కూడా చూసేవారు. కానీ సైలూ మాత్రం నాకు బాగా నచ్చింది.
“నన్ను ఇష్టపడని అమ్మాయి ఉండదు” అన్న కాన్ఫిడెన్స్ నాకు బాగా ఉంది. అందుకే నేను డిసైడ్ అయ్యాను—సైలూని ఎలా గానో పడేయాలి.


సైలూ అంత పెద్ద అందగత్తె ఏమీకాదు. అవరేజ్‌గా ఉంటుంది. స్కిన్ టోన్ ప్యూర్ వైట్ కాదు—లైట్ వైట్. లాంగ్ హెయిర్, స్లిమ్‌గా ఉంటుంది. అందుకే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది—తనకి నేను డెఫినిట్‌గా నచ్చుతాను.

అప్పుడు నుంచి నేను ఆమెని చూడడం స్టార్ట్ చేశాను—డైలీ మా బాల్కనీ నుంచి. రోజుకు 4–5 సార్లు, లేదా ఛాన్స్ దొరికినప్పుడల్లా, ప్రతి సారి బాల్కనీకి వచ్చి ఆమెకి సైట్ కొడుతూనే ఉండేవాడిని. ఇలా కొన్ని రోజులు గడిచాయి… కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు.

ఒక రోజు—దాదాపు 20 రోజుల తర్వాత—నేను ఆమెని చూస్తూ ఉండగా, ఆమె ఫ్రెండ్ వచ్చింది. నేను అలాగే చూస్తూ ఉండడం ఆమె ఫ్రెండ్ గమనించి, సైలూకి చెప్పింది. అప్పుడు సైలూ “నాకు తెలుసులే” అన్నట్టు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఇద్దరూ నవ్వుకున్నారు.
అది నేను సైలూ నవ్వడం చూసిన మొదటి సారి. ఎందుకో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించింది.

ఆ రోజు నుంచి సైలూ కూడా కొంచెం కొంచెంగా నన్ను చూడడం స్టార్ట్ చేసింది. అవును… అవును… తనలో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. I can smell that. ఇలా నేను ఆమెని చూడడం, ఆమె లైట్‌గా నన్ను చూడడం—అలా కొన్ని రోజులు గడిచాయి.


ఒక రోజు—మా మేన కోడలు ఉయ్యాల ఫంక్షన్

ఆ ఫంక్షన్‌కి అందరూ వస్తారు. సైలూ కూడా వస్తుందని నాకు తెలుసు. అందుకే నేను బాగా డ్రెస్ అప్ అయ్యాను—వైట్ షర్ట్, బ్లూ జీన్స్… క్లాసిక్ కాంబో.

ఫంక్షన్ స్టార్ట్ అయింది. కానీ సైలూ కనిపించలేదు. నేను సాధారణంగా ఫంక్షన్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను. అప్పుడు సడన్‌గా నా హార్ట్ బీట్ పెరిగింది. నా వెనకాల నుంచి సైలూ ఫ్రెండ్ “సైలూ… సైలూ…” అని గట్టిగా పిలుస్తోంది. అసలు సైలూ తన పక్కనే ఉంది.
అలా ఎందుకు పిలుస్తోంది అంటే—ఇండైరెక్ట్‌గా నన్ను ఆటపట్టించడానికి. అది నాకు అర్థమైంది. కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది.

అప్పుడే నేను వెనక్కి తిరిగాను… సడన్‌గా సైలూని చూసాను. OMG! తనని అంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైమ్.
తనూ నన్ను చూసింది. వెంటనే మూతి బిగించుకుని, అప్పటివరకు ఉన్న నవ్వును కంట్రోల్ చేసుకుంటూ, తన చూపును నా నుండి తిప్పుకుంది.

“అబ్బా… దీనికి చాలా ఎక్స్‌ట్రాలు ఉన్నాయ్!” అనుకున్నాను.
“తనకే అన్ని ఉంటాయా? మనకి ఏమైనా తక్కువా?” అనుకుని, నేను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను.

ఆ రోజు మొత్తం నేను ఆమె చుట్టూ తిరిగినా… అసలు ఆమెని పట్టించుకోలేదు. తనకి నా వాల్యూ తెలియాలి కదా—అందుకే అలా చేశాను.


తర్వాతి 5 రోజులు కంటిన్యూస్‌గా నేను సైలూని కావాలనే అవాయిడ్ చేశాను. నేను ఆమె లవ్‌ని టెస్ట్ చేయాలనుకున్నాను.

6వ రోజు…

నేను బాల్కనీ లోపల, ఎవరికి కనిపించకుండా కూర్చున్నాను. సైలూ బయటకి వచ్చింది. తన పని చేసుకుంటోంది. మా బాల్కనీ వైపు చూస్తుందేమో—నాకోసం అనుకుంటూ నేను చూస్తున్నాను.
కానీ ఆమె తన పనిలో ఇన్‌వాల్వ్ అయిపోయింది… అసలు చూడట్లేదు.

“ఏంటి ఇలా?” అని నేను అనుకుంటూ ఉండిపోయాను…

తన పని చేసుకుని వెళ్లిపోతూ సడన్‌గా మా బాల్కనీ వైపు చూసింది. నేను తనకు కనిపించకుండా ఉన్నాను. కొంచెం సేపు అలాగే చూస్తూ నిలబడి, తర్వాత వెళ్లిపోయింది. ఇలా మూడు రోజుల పాటు జరిగింది.

అప్పుడు మేము విజాగ్ వెళ్లి, ఒక వారం రోజుల పాటు మా రిలేటివ్స్ హౌస్‌లో ఉండి వచ్చాం.

 దాదాపు 10 రోజులు నేను అసలు సైలూని చూడలేదు… తాను కూడా నన్ను చూడలేదు. నాకు మాత్రం ఆమెను చూడాలనిపిస్తోంది. కానీ తాను నిజంగా నన్ను లవ్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే… ఇలా చేయక తప్పదు.

అలా 10 రోజుల తర్వాత నేను మళ్లీ ఇంటికి వచ్చాను. బాల్కనీకి వెళ్లి, ఈసారి కూడా ఆమెకు కనిపించకుండా సైలూని ఆబ్జర్వ్ చేస్తున్నాను. ఆమె యూజువల్‌గా తన పని చేసుకుంటోంది. కానీ ఈసారి ఒక చిన్న చేంజ్ ఉంది—ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మా బాల్కనీ వైపు చూస్తోంది. అంటే… she is searching for me.

ఆమె అలా చూసే టైంలోనే నేను సడన్‌గా ఎంట్రీ ఇచ్చాను. ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. తన ముఖంలో హ్యాపీనెస్, షాక్… మరియు అందులోనే మోస్ట్ లవ్లీ థింగ్—క్లీన్ & ప్యూర్ లవ్—అది నేను స్పష్టంగా చూసాను. ఆ క్షణం… its worthless.

I’m in love… we are in love.

మేమిద్దరం అలాగే ఒకరినొకరు చూస్తూ సుమారు 10 నిమిషాలు గడిపాము. తర్వాత ఆమె ఒక చిన్న నవ్వు నవ్వింది.
“ఏమైపోయావ్? కనిపించట్లేదు…” అని సైగ చేసింది…


ప్రేమకు అంతం లేదు…


Keep Loving & Keep Reading......

Thanks for reading the story.

Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com

 

Saturday, April 18, 2026

అమ్మ అమ్మమ్మ ఒక aunty - Telugu Story

Note:

This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any similarities are purely coincidental. Use of this work in any form requires my permission. 


ఇది 1998 సెప్టెంబర్ నెలలో జరిగిన విషయం. మాది ఒక చిన్న పల్లెటూరు. మా ఇల్లు చిన్నదే. నా నాన్న దుబాయ్‌లో పనిచేస్తాడు. ఇక్కడ నేను, మా అమ్మ, మా అమ్మమ్మ మాత్రమే ఉంటాం. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది—ఆమె వయసు సుమారు 55 ఏళ్లు. ఆమె మా అమ్మకి చాలా మంచి స్నేహితురాలు. రోజులో సగం సమయం ఆమె మా ఇంట్లోనే గడుపుతుంది. ఆమె భర్త 10 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది.

మా అమ్మకి నేను చాలా ఇష్టం. నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేరు కాబట్టి నన్ను చాలా ప్రేమగా పెంచారు. నాకు అప్పటికి 21 ఏళ్లు. ఇంటర్ పూర్తయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంట్లోనే ఉండి చదువుతున్నాను.

ఒక రోజు నాకు చాలా బోర్‌గా అనిపించింది. రోజూ చదువుతూనే ఉండడం వల్ల కొంచెం రిలాక్స్ కావాలని సినిమా వెళ్లాలని అనిపించింది. కానీ మా అమ్మను అడిగితే ఒప్పుకోదని తెలుసు, ఎందుకంటే 10 రోజుల్లో బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అందుకే లైబ్రరీకి వెళ్తున్నాను అని చెప్పి పక్కింటి ఆంటీ ఇంటికి వెళ్లాను.

ఆంటీతో నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా అమ్మతో చెప్పలేని విషయాలు—సినిమాలు, కాలేజీ లవ్ స్టోరీస్ వంటివి—అన్నీ ఆంటీకి చెబుతాను. నేను ఆంటీని డబ్బులు అడిగాను. ఆమె ఇచ్చింది. కానీ నాకు ఇంకో సహాయం కావాలని చెప్పాను—అంటే, నాతో పాటు సినిమా కి రావాలని. నాకు ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి.

ఆంటీకి మొదట కోపం వచ్చింది, ఎందుకంటే ఆమెకి ఆ రోజు చాలా పనులు ఉన్నాయి. నేను నిరుత్సాహంగా డబ్బులు తిరిగి ఇచ్చేశాను. అప్పుడు ఆంటీ నా వెంట సినిమా కి రావడానికి ఒప్పుకుంది.

మేము మధ్యాహ్నం షోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా అమ్మకి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఆంటీ స్నానం చేసి బ్రౌన్ కలర్ సిల్క్ చీర కట్టుకుని రెడీ అయింది. నేను ముందుగా బస్ స్టాండ్‌కి వెళ్లాను. ఆంటీ వేరుగా వచ్చింది. ఇద్దరం బస్‌లో టౌన్‌కి వెళ్లి థియేటర్‌లో టికెట్లు తీసుకుని హాల్లో కూర్చున్నాం.

సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. హాల్ మొత్తం చీకటిగా ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వాతావరణం చల్లగా ఉంది. మల్లెపూల వాసన వచ్చింది—ఆంటీ జుట్టులో ఉన్నాయి.

ఆంటీ: ఇది ఏ సినిమా? ఇంగ్లీష్‌దా?
నేను: అవును, కానీ తెలుగు డబ్బింగ్‌లో వస్తుంది
ఆంటీ: నేను చాలా కాలం తర్వాత సినిమా చూస్తున్నాను
నేను: మరి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేసారు?
ఆంటీ: నా వయసులో సినిమాలా అవసరమా?
నేను: వయసుకు సినిమాకి సంబంధం లేదు
ఆంటీ: హ్మ్మ్

సినిమా ప్రారంభమైంది. ఒక గంట అయింది. నేను పూర్తిగా సినిమాలో మునిగిపోయాను. ఆంటీ మాత్రం నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత ఫ్యాన్ గాలి వల్ల ఆమె చీర పైట కిందకు జారింది. నేను అనుకోకుండా చూసాను. ఒక్కసారిగా షాక్ అయినట్టు అనిపించింది. ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. నేను సినిమా వదిలి ఆ దృశ్యాన్ని చూడటం మొదలుపెట్టాను.

ఇంటర్వెల్ అయింది. రెండో భాగం ప్రారంభమైన తర్వాత మళ్లీ ఆమె నిద్రపోయింది. ఈసారి చీర పైట కిందకు జారలేదు. కానీ నేను దాని కోసం ఎదురు చూసాను. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా ఆమెకు తెలియకుండా కొంచెం కిందికి నేను జరిపాను. మళ్లీ చూడటం ప్రారంభించాను.

సినిమా ముగిసింది. మేము బస్ స్టాండ్‌లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉండగా పక్కనున్న హోటల్ నుంచి చికెన్ బిర్యానీ వాసన వచ్చింది. ఆంటీ మనం తిందామా అని అడిగింది. నేను సరే అన్నాను. కానీ అప్పుడే బస్ వచ్చింది. నేను ఆమెను ముందుగా వెళ్లమని, నేను బిర్యానీ తీసుకుని వస్తానని చెప్పాను. ఆమె వద్దని చెప్పినా వినలేదు.

నేను రాత్రి 9 గంటలకు బిర్యానీతో ఇంటికి వచ్చాను. మా ఇంట్లో ఎవరూ లేరు—ఒక బంధువు చనిపోవడంతో వెళ్లారని తెలిసింది. నేను స్నానం చేసి, సువాసన ద్రవ్యాలు వేసుకుని, బిర్యానీ తీసుకుని ఆంటీ ఇంటికి వెళ్లాను.

ఆంటీ: ఎప్పుడు వచ్చావు?
నేను: బస్ లేట్ అయింది
ఆంటీ: ఎందుకు ఇంత కష్టపడ్డావు?
నేను: మీరు అడిగారు కదా

ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం. తర్వాత హాల్లో కూర్చుని మాట్లాడుకున్నాం.

నేను: మా ఇంట్లో ఎవరూ లేరు. ఈరోజు చూసిన సినిమా వల్ల నాకు భయం వేస్తుంది
ఆంటీ: నేను పక్కనే ఉన్నాను కదా
నేను: మీరు బెడ్‌రూంలో ఉంటారు. నేను భయపడి అరుస్తే మీకు వినిపించదు
ఆంటీ: మరి?
నేను: నేను ఇక్కడే పడుకుంటాను
ఆంటీ: సరే

రాత్రి 11 అయ్యింది. ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకున్నాం. బయట వర్షం, చల్లని గాలి. నేను నెమ్మదిగా ఆమె నడుముపై చేయి పెట్టాను. ఆమె నిద్రలోనే ఉంది. కొద్దిసేపటి తర్వాత మసాజ్ చేశాను. తర్వాత చేతిని నెమ్మదిగా పైకి జరిపాను.

అప్పుడే ఆమె లేచింది.

ఆంటీ: ఏమి చేస్తున్నావు?
నేను: ఏమీలేదు
ఆంటీ: ఇదేనా ఏమీలేదు?

నేను మౌనంగా ఉండిపోయాను. అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభించాను.

ఆంటీ: ఎందుకు ఏడుస్తున్నావు?
నేను: నా పరిస్థితి మీకు తెలియదు… చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్, తర్వాత బాయ్స్ కాలేజీ… ఇప్పుడు ఇంట్లోనే. నాకు తెలిసిన మహిళలు ముగ్గురే—మా అమ్మ, అమ్మమ్మ, మీరు. అందుకే మీపై ఆకర్షణ కలిగింది…

చివరగా నేను చెప్పాను: “మీకు నేను నచ్చితే 5 నిమిషాల్లో లైట్ ఆఫ్ చేయండి. లేకపోతే నేను వెళ్లిపోతాను.”

5 నిమిషాల తర్వాత… నేను బయటకు వస్తుండగా… ఆంటీ లైట్ ఆఫ్ చేసింది.

 అసలు కథ మొదలైంది 

-------------------------------------------------)))(((----------------------------------------

ఈ కథ ముగిసింది


Thanks for reading this story.

Author @Srinivasu B


If you are looking for a perfect romantic/adult/love/horror story for your short film/movie/articles/etc please contact 

srinivasub1996@gmail.com


My Secret Colleague- Part -1

Note: This story is solely my own work and is based entirely on my imagination. It is not taken from real-life characters or events, and any...